![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1095 లో... రిషి కనిపించాడని ఎవరో ఫోన్ చెయ్యగానే వసుధార, మను ఇద్దరు అతను చెప్పిన అడ్రెస్ కు వెళ్తారు. తీరాచూస్తే అక్కడ శైలేంద్ర ఉంటాడు. ఈ పని శైలేంద్ర చేసాడని.. ఎందుకు మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటావని వసుధార కోప్పడుతుంది. నేనేం చేసాను టీ తాగుతున్నాను.. ఇది తప్పా అని శైలేంద్ర అమాయకంగా అడుగుతాడు.
ఫోన్ ఎందుకు చేసావని వసుధార అడుగుతుంది. నేను చెయ్యలేదు కావాలంటే ఫోన్ చూడమని శైలేంద్ర వసుధారకు ఇస్తాడు. వసు ఫోన్ తీసుకొని చూస్తుంది. అందులో వసుధారకు ఫోన్ చేసినట్లు ఉండదు. నువ్వు చేసి డిలీట్ చేసావ్ కావచ్చని మను అంటాడు. వసుధార తనకి వచ్చిన నెంబర్ కు కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చెయ్యరు. ఆ తర్వాత శైలేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. టీ షాప్ అతను మిస్డ్ కాల్ ఉందని ఫోన్ చేస్తాడు. వసుధార లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. అక్కడ పక్కనే టీ షాప్ అతను కావడంతో ఇందాక నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పింది నువ్వేనా అని వసుధార అనగానే.. లేదు ఇందాక మీతో మాట్లాడిన అతను అని టీ షాప్ అతను చెప్పగానే. శైలేంద్ర ఇదంతా చేసాడని వసుధార, మను ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత దేవయాని మహేంద్ర దగ్గరికి వెళ్తుంది. ఈ పేపర్ లో రిషి గురించి ఎందుకు వేశారు.. ఇన్నాళ్లు ఇంటి పరువు తీశారు.. ఇప్పుడు కాలేజీ పరువు తీస్తున్నారా అని దేవయాని అనగానే.. మహేంద్ర తనపై కోప్పడతాడు. మీకిచ్చిన మూడు నెలల గడువు ఈ వారంతో పూర్తవుతుంది. ఈ లోపు రిషిని తీసుకొని రాకుంటే రిషికి కర్మకాండ జరిపిస్తాను.. కాలేజీలో సంతాపసభ ఏర్పాట్లు చేస్తానని మహేంద్ర, అనుపమలకి దేవయాని చెప్పి వెళ్తుంది.
ఆ తర్వాత రిషి గురించి పేపర్ లో రావడం చూసి.. స్టూడెంట్స్ అంతా వసుధారని అడుగుతారు. శైలేంద్ర వాళ్లని కావాలనే రెచ్చగోడతాడు. వసుధార స్టూడెంట్స్ కు.. రిషి సర్ ని తీసుకొని వస్తానని చెప్తుంది. ఆ తర్వాత దేవయాని అన్న మాటలు వసుధారకి మహేంద్ర చెప్తాడు. శైలేంద్ర చేసిన పని గురుంచి వసుధార చెప్తుంది. ఎలాగైనా రిషిని కనుక్కోవాలని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర జాతకం చూసుకుంటూ.. హ్యాపీగా ఫీల్ అవుతుంటే దేవయాని వస్తుంది. ఇప్పుడు నేనేం చేసిన నాకు అనుకూలంగా ఉందని శైలేంద్ర అంటుంటే.. అప్పుడే ఫణీంద్ర, ధరణి వస్తారు. నువ్వు అనుకున్నదేం జరిగింది.. నువ్వు చేసిన పని తెలిసిందంటు శైలేంద్రని ఫణీంద్ర తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.
![]() |
![]() |